ఐ ఎల్ పి ఎ 5వ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి
కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్
సామాన్య ప్రజల న్యాయం కోసం నిత్యం పోరాడే న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజల రక్షణ కోసం ఎన్నో చట్టాలను రూపకల్పన చేయడంలో కీలకపాత్ర పోషించే న్యాయవాదులకు రక్షణ చట్టం లేదని, న్యాయవాద రక్షణ చట్టం కోసం దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు ఐక్యంగా పోరాటం చేయాలని కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కందుల అరుణ్ కుమార్ అన్నారు. ఈ నెల 20 న కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరుగు ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ 5వ రాష్ట్ర సదస్సు గోడ పత్రికలను సోమవారం కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో విడుదల చేసి ఆయన మాట్లాడారు. దాదాపు అన్ని వర్గాలకు రక్షణ చట్టాలున్నాయని, న్యాయాన్ని కాపాడే న్యాయవాదుల కే రక్షణ చట్టం లేకపోవడం శోచనీయం అని ఆయన అన్నారు. సమాజంలో అత్యున్నత విద్యతో పాటు రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన ఉన్నత విద్యావంతులైన న్యాయవాదుల పోరాటం ద్వారా న్యాయవాదుల రక్షణతో పాటు సామాన్యులకు మేలు జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిని నరేందర్ మాట్లాడుతూ పూలే, అంబేద్కర్ సిద్ధాంత పునాదితో న్యాయవాదుల వృత్తిపరమైన అభివృద్ధితో పాటు సామాజిక చైతన్యం, సామాజిక న్యాయం కోసం ఐ ఎల్ పి ఎ చేస్తున్న పోరాటంలో న్యాయవాదులు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20 న కొత్తగూడెంలో జరుగు రాష్ట్ర సదస్సులో రాజ్యాంగ విలువలు - ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్ట్ ప్రజల హక్కులు, ఇ డబ్ల్యు ఎస్ కు లేని నిబంధన ఓబీసీ లకు ఎందుకు, మహిళా కోటాలో బహుజన కోటా, న్యాయవాద రక్షణ చట్టం అనే నాలుగు అంశాలపై జరుగు సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ హై కోర్టు జడ్జి, మాజీ జాతీయ ఓబీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, విశిష్ట అతిథులుగా కొత్తగూడెం జిల్లా జడ్జి పాటిల్ వసంత్, అదనపు జిల్లా జడ్జి ఎస్ సరిత, గౌరవ అతిథులుగా రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి టి చిరంజీవులు, కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, ఐ ఎల్ పి ఎ జాతీయ అధ్యక్షులు సుజాత కె చౌదంటే లు హారవుతారని తెలిపారు. ఇట్టి సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుండి న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు పొడిచేటి శ్రీనివాస్, వెన్నపూజ పరశురాజ్, న్యాయవాదులు రఘునందన్ రాజు, వాసాల నరేష్, ప్రభాకర్, పి. వేణుగోపాల్, ప్రియాంక, అనూష, నిషాని రాజేందర్, స్రవంతి, కిరణ్మయి, న్యాయశాస్త్ర విద్యార్థులు రోజ, నిష, మమత, సంగీత, శ్రావణి, మేఘన తదితరులు పాల్గొన్నారు.
